Purudu Posthe lancham , boddukosthe lancham , amma paalakanna munde parichayamee lanchamPurudu Posthe Lancham - from Broker- Touching Song on Corruption
Movie-Broker (Telugu) RP Patnaik
Singer-Priya Subramanian
Lyrics-Chaitanya Prasad
పురుడు పోస్తే లంచం, బొడ్డుకోస్తే లంచం, అమ్మ పాలకన్న ముందే పరిచయమీ లంచం,
బతకడానికి లంచం , ఎదగడానికి లంచం, అంతరాత్మని తాక్కటు పెట్టేది లంచం,
నిజాము నిజమని నమ్మాలంటే లంచం, అబద్దం నిజమంటూ నమ్మించే లంచం,
లంచాలు లేనట్టి మంచిప్రపంచం కావ్వాలన్న కాని ఇవ్వాలీ లంచం,
పసిపాప ముద్దిస్తే చాక్లెట్టు లంచం, పిల్లోడు పాసైతే సెల్ ఫోను లంచం,
ఇల్లాలు సేవలకు నేక్లేస్సు లంచం, శ్రీవరికివ్వాలి కౌగిల్ల లంచం,
ఇంటింట సరదాగా మొదలైన లంచం, ఇంతింతై లోకాన్ని కమ్మిందీ లంచం,
ప్రేమల్లోన లంచం, పెళ్లిల్లోనా లంచం, అనుబందాల్ని వేళ్ళతో ఆడించే లంచం.
నిరుపేద బతుకుల్ని పీల్చేదీ లంచం , పిడికిట్లో మెతుకులను దోచేదీ లంచం,
ప్రాజెక్ట్ లంటూ బొక్కేదీ లంచం, గుడిలోని దేవుణ్ణి మింగేదీ లంచం,
డ్యూటీ చాటున సాగు లూటీ లంచం, అభివృద్దిని నట్టేట్లో ముంచేదీ లంచం,
బర్త్ ప్రూఫ్ కి లంచం, డెత్తుప్రూఫ్ కి లంచం, వల్లకాటికి పోయినా వీడదీ లంచం,
నీతి లేని లంచం జాతిలేని లంచం, తెల్ల దొరలను మరిపించే లంచం.



0 comments:
Post a Comment